చంద్రబాబు కోరారు సరే....

First Published Jul 25, 2017, 6:14 PM IST
Highlights
  • కేంద్రం ఏపికి ఏనాడూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనేలేదు. జైట్లీ చేసిన ప్రకటన కేవలం ‘ప్రత్యేకసాయం’ అని మాత్రమే. కేంద్రం ఒకటి ప్రకటిస్తే, చంద్రబాబు మరోటి డిమాండ్ చేస్తున్నారు.
  • గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ను కలిసి గ్రామీణ ఉపాధిహామీ నిధులు రూ. 1351 కోట్లు విడుదల చేయాలని కోరారట.
  • అందుబాటులో భూమి లేని కారణంగా అటవీ భూములను ఇవ్వాలంటూ గతంలోనే కేంద్రాన్ని చంద్రబాబు కోరినా కేంద్రం స్పందించలేదు.

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబునాయుడు పలువురు కేంద్రమంత్రులను కలిసి కోరికల చిట్టాను విప్పారు. రాష్ట్రానికి రావలసినవి, కావల్సినవి, పెండింగ్ లో ఉన్న డిమాండ్లన్నింటినీ అడిగేసారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి వెళ్ళిన చంద్రబాబు పనిలో పనిగా కేంద్రమంత్రులను కూడా కలిసారు లేండి. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కేంద్రమంత్రులను తాను అడిగిన వివరాలను చెప్పారు. మరి, కేంద్రమంత్రులు ఏమన్నారో మాత్రం చెప్పలేదు. ఏమంటారు లేండి? మూడేళ్ళుగా ఏమని సమాధానం చెబుతున్నారో అదే సమాధానాన్ని ఈరోజు కూడా చెప్పుంటారు.

అరుణ్ జైట్లీని కలిసి ప్రత్యేక ప్యాకేజి నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. విచిత్రం కాకపోతే కేంద్రం ఏపికి ఏనాడూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనేలేదు. జైట్లీ చేసిన ప్రకటన కేవలం ‘ప్రత్యేకసాయం’ అని మాత్రమే. కేంద్రం ఒకటి ప్రకటిస్తే, చంద్రబాబు మరోటి డిమాండ్ చేస్తున్నారు. అందుకే కేంద్రం ఏమాత్రం స్పందించటం లేదు. ఇక, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ను కలిసి గ్రామీణ ఉపాధిహామీ నిధులు రూ. 1351 కోట్లు విడుదల చేయాలని కోరారట.

రాజధానికి అటవీ భూములను కేటాయించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్ తో మాట్లాడానన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పుడున్న భూమికి అదనంగా 12500 ఎకరాల భూమి కావాలని చెప్పారు. అందుబాటులో భూమి లేని కారణంగా అటవీ భూములను ఇవ్వాలంటూ గతంలోనే కేంద్రాన్ని చంద్రబాబు కోరినా కేంద్రం స్పందించలేదు. అదే విషయాన్ని చంద్రబాబు తాజాగా కదిపారు. కాకినాడ దగ్గర పెట్రోలియం క్యారిడార్ తో పాటు తదితరాలను కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేద్రప్రధాన్ను అడిగినట్లే చెప్పారు. చంద్రబాబు డ్యూటి చంద్రబాబు చేసారు. మరి, కేంద్రమంత్రులేం చేస్తారో చూడాలి.

 

click me!