ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ చర్చి పాస్టర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. తన పెంపుడు కుక్కను ఎయిర్‌గన్‌తో కాల్చి చంపాడు. ఎయిర్‌గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అతనిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని అడవిరావులపాడులో ఓ చర్చి పాస్టర్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను ఎయిర్‌గన్‌తో కాల్చి చంపాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని హెమర్టర్‌గా గుర్తించాడు. ఇతను ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. అయితే తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి.. క్రిస్టియన్ మిషనరీ సంస్థలో పాస్టర్‌గా మారాడు. అప్పటి నుంచి మత బోధనలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు.
అయితే ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం సాయత్రం హెమర్టర్ తన ఎయిర్‌గన్‌తో పెంపుడు కుక్కను కాల్చాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుక్క విలవిలలాడుతూ.. బయటకు పరుగులు తీసి రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. దీనిని గమనించిన స్థానికుడు పాస్టర్‌ను నిలదీశాడు. వెంటనే మరికొందరు స్థానికులు తోడవ్వడంతో పాటు జనావాసాల్లో ఎయిర్‌గన్‌లు వాడటమేంటని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అతనిని ప్రశ్నిస్తున్నారు.