పల్నాడు జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణమేనా, భార్యపై భర్త ఫిర్యాదు

Siva Kodati |  
Published : Oct 01, 2022, 07:33 PM IST
పల్నాడు జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణమేనా, భార్యపై భర్త ఫిర్యాదు

సారాంశం

పల్నాడు జిల్లా నాదెండ్లలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. అయితే తన భార్యే ప్రియుడితో కలిసి పాపను చంపేసిందని చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పల్నాడు జిల్లా నాదెండ్లలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తన భార్యే ప్రియుడితో కలిసి పాపను చంపేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన ప్రసాద్, ధనలక్ష్మీకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగేళ్లు పాప వుంది. బయ్యవరం గ్రామానికి చెందిన వాలంటీర్ మట్టా పిచ్చయ్యతో ప్రసాద్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు దూరంగా వుంటూ వాలంటీర్‌తో కలిసి గణపవరంలో సహజీవనం చేస్తోంది. అయితే కూతురు నవ్యశ్రీ అనారోగ్యంతో చనిపోయిందని ప్రసాద్‌కు సమాచారం ఇచ్చిందామె. ప్రియుడితో కలిసి భార్యే కూతురిని చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రసాద్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu