చెల్లి పెళ్లి కోసం ప్రయాణికురాలిని దోచేసిన రైల్వే ఉద్యోగి

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 11:40 AM IST
Highlights

పెళ్లీ ఈడు కొచ్చిన చెల్లెలు కళ్లెదుట కనిపిస్తుంటే ఆమెకు త్వరగా పెళ్లి చేయాలని అన్నయ్య ఆందోళనకు గురికావడం కామన్. అయితే సక్రమంగా సంపాదించి చెల్లిలి పెళ్లి చేయలేక ఓ అన్నయ్య దోడ్డి దారిని ఎంచుకున్నాడు. 

పెళ్లీ ఈడు కొచ్చిన చెల్లెలు కళ్లెదుట కనిపిస్తుంటే ఆమెకు త్వరగా పెళ్లి చేయాలని అన్నయ్య ఆందోళనకు గురికావడం కామన్. అయితే సక్రమంగా సంపాదించి చెల్లిలి పెళ్లి చేయలేక ఓ అన్నయ్య దోడ్డి దారిని ఎంచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..  తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రాజారావుపేటకు చెందిన దామిశెట్టి ఉపేందర్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లె బెడ్‌ రోలర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పెళ్లి చేయడానికి తన సంపాదన చాలక పోవడంతో ఒక ప్లాన్ వేశాడు.

గతేడాది నవంబర్ 25న చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ ఏ-1 కోచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బోగీలో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగులో ఉన్న బ్రాస్‌లెట్, ఉంగరం, చెవిపోగులు, రెండు బంగారు గాజులతో పాటు మరికొన్ని ఆభరణాలు మొత్తం 37 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు.  

వీటి విలువ రూ. 1.20 లక్షలు ఉంటుంది. తన ఆభరణాలు చోరి జరిగినట్లు గుర్తించిన సదరు మహిళ వెంటనే ఈ విషయాన్ని ఖాజీపేట రైల్వే పోలీసులకు తెలిపింది. అలాగే ఉపేందర్‌పై అనుమానం వ్యక్తం చేసింది. కే

సు నమోదు చేసుకున్న పోలీసులు ఉపేందర్‌ను ప్రశ్నించగా అతనే నిందితుడని తేలింది. నేరాన్ని అంగీకరించి ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు.  అతనిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చెల్లి పెళ్లి కోసమే తాను ఈ దొంగతనం చేశానని ఉపేందర్ తెలిపాడు. 
 

click me!