బిజెపిలోనే ఉంటా, లోకసభకు పోటీ చేస్తా: పురంధేశ్వరి

By pratap reddyFirst Published Jan 29, 2019, 11:05 AM IST
Highlights

భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు హితేష్ చెంచురామ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాను కూడా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పురంధేశ్వరి స్పష్టత ఇచ్చారు.

హైదరాబాద్: తాను బిజెపిలోనే ఉంటానని, వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. 

భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు హితేష్ చెంచురామ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాను కూడా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పురంధేశ్వరి స్పష్టత ఇచ్చారు. 

వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగానే తాను పోటీ చేస్తానని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని చెప్పారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు 

గత ఎన్నికల్లో పురంధేశ్వరి బిజెపి అభ్యర్థిగా రాజంపేట లోకసభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆమె వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

సంబంధిత వార్త

వైసిపిలోకి దగ్గుబాటి, హితేష్: పురంధేశ్వరి తీవ్ర ఆవేదన

click me!