వైసీపీకి షాక్: చంద్రబాబుతో విజయసాయి బావమరిది భేటీ

Published : Jan 29, 2019, 11:16 AM IST
వైసీపీకి షాక్: చంద్రబాబుతో విజయసాయి బావమరిది భేటీ

సారాంశం

వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమీప బంధువు గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు.


కర్నూల్:వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమీప బంధువు గడికోట ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ టిక్కెట్టును ఆయన ద్వారకనాథ్ రెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు ఆయన చంద్రబాబుతో  భేటీ అయ్యారని సమాచారం.

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 22వ తేదీన మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుండి మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.

మరో వైపు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి మల్లిఖార్జున్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆకేపాటి  ప్రకటించారు. 

మరోవైపు ఇదే స్థానం నుండి వైసీపీ టిక్కెట్టును ఆశిస్తున్న  వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి బావమరిది గడికోట ద్వారకనాథ్ రెడ్డికి  కూడ వైసీపీ టిక్కెట్టు ఇవ్వడానికి నిరాకరించింది.దీంతో ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ చీఫ్‌ చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. 

దీంతో ద్వారకనాథ్ రెడ్డి  టీడీపీలో చేరనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉంది.  మరోవైపు మేడా మల్లిఖార్జున్ రెడ్డి తండ్రి టీటీడీ బోర్డు సభ్యుడి పదవికి రాజీనామా చేయాలని కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu
అచ్చెన్నాయుడు స్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా | Achchennaidu Powerful Speech | Asianet News Telugu