
ఒక్కోసారి ఓటరునాడిని పట్టుకోవటంలో రాజకీయపార్టీలతో పాటు మీడియా కుడా విఫలమవుతాయి. ఎందుకంటే ఓటరునాడి ఎవరి అంచనాలకు అందదు. అందుకు తాజా ఉదాహరణ నంద్యాల ఉపఎన్నికే. మొన్నిటి నంద్యాలలో అయినా నిన్నటి కాకినాడలో అయినా ఓటరునాడి పట్టుకోవటంలో రాజకీయాల్లో తలపండిపోయిన, 40 ఇయర్స్ ఇండస్ట్రి అని చెప్పుకునే చంద్రబాబునాయుడు, జగన్ తో సహా అందరూ విఫలమయ్యారు. మీడియా సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు.
నిజానికి చంద్రబాబును మూడేళ్ళుగా బాగా భయపెట్టిన అంశాలు రెండున్నాయి. ఒకటి వైసీపీకున్న ఆధరణ. రెండోది కాపుల ఉద్యమం. ఈ రెండు అంశాలను చూసే ఫిరాయింపులను గెలిపించుకోలేమన్న భయంతో వారితో చంద్రబాబు రాజీనామా చేయించలేదు. అదేవిధంగా కాపుల ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడతాయన్న ఉద్దేశ్యంతోనే మున్సిపల్ ఎన్నికలూ పెట్టలేదు.
ఎంత భయపడినా చివరకు నంద్యాల, కాకినాడ ఎన్నికలను చంద్రబాబు ఆపలేకపోయారు. ఎందుకంటే, సిట్టింగ్ సభ్యుడు చనిపోయారు కాబట్టి ఎన్నికల సంఘం నంద్యాలలో ఉపఎన్నిక నిర్వహించింది. ఇక, కాకినాడ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నిక కోర్టు ఆదేశాల వల్ల జరపాల్సి వచ్చంది.
విచిత్రమేంటంటే ఇంతకాలం చంద్రబాబు ఏ కారణాలతో భయపడ్డారో అవి కేవలం భ్రమ మాత్రమేనని తేలిపోయింది. అఫ్ కోర్స్ నంద్యాల ఫలితం వచ్చిన తర్వాత అనుకోండి. అంటే, ఇంతకాలం చంద్రబాబు తాడును చూసి పామనుకుని భయపడ్డారా? అన్న చర్చ జరుగుతోంది. జరిగినదాన్ని బట్టి చూస్తే జనాల నాడిని చంద్రబాబు సరిగ్గా పట్టుకోలేకపోయారనే కదా అర్ధం? చంద్రబాబుతో పాటు వైసీపీ, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు జనాలను అర్ధం చేసుకోవటంలో విపలమయ్యాయి. చివరకు పవన్ కల్యాణ్ కుడా భయపడే కదా తటస్తంగా ఉంటానని ప్రకటించింది. రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఎక్కడ విఫలమయ్యారబ్బా?