
తెలుగుదేశంపార్టీ బలంగా ఉందనుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా వైసీపీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు పి. గన్నవరం ఎంఎల్ఏగా గెలిచిన పాముల రాజేశ్వరిదేవి శనివారం వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాముల తన మద్దతుదారులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. పాముల 2004, 2009లో ఎంఎల్ఏగా గెలిచారు.