ఏపీ ఆర్ధిక వ్యవహరాలపై పయ్యావుల మరో లేఖ...

By AN TeluguFirst Published Jul 10, 2021, 12:11 PM IST
Highlights

రూ. 17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందంటోన్న పయ్యావుల తెలిపారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు. 

అమరావతి : ఏపీ ఆర్ధిక వ్యవహరాలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల మరో లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ రాసిన లేఖను పయ్యావుల విడుదల చేశారు.

రూ. 17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిందంటోన్న పయ్యావుల తెలిపారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పయ్యావుల డిమాండ్ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ జమాఖర్చులపై పీఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు.  ప్రభుత్వ జమాఖర్చుల నిర్వహణపై ఆయన గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. నలబై వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడి ఆదేశాల మేరకు గవర్నర్ ను కలిసి ఆర్థిక శాఖలోని లోపభూయిస్టాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రైవేటు వ్యవస్థను నడపడానికి ఏవిధంగా అకౌంటింగ్ ప్రాసెస్ వుంటుందో..రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కూడా జమా ఖర్చులను ఏ నివేదికలో రూపొందించాలనే విధివిధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకున్నాయని ఆయన చెప్పారు. 

అయితే దీనిమీద.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ స్పందించింది. రూ. 40 వేల కోట్ల ఖర్చుకు లెక్కలు లేవని పయ్యావుల ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. కేశవ్ ఆరోపణల్ని ఖండించింది. అన్నీ పద్ధతిగానే జరుగుతున్నాయని ఆర్ధిక శాఖ వెల్లడించింది. ప్రతి ఏడాది కాగ్ పరిశీలనలను ఆర్ధిక శాఖ దృష్టికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపింది. సర్దుబాట్లు ఎక్కువగా పీడీ అకౌంట్స్‌లోనే జరిగాయని ఆర్ధిక శాఖ పేర్కొంది. ఆర్ధిక శాఖ చర్యలను కాగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు వివరిస్తామని తెలిపింది. 

click me!