ఇంతలో అస్వస్థతకు గురైన మైథిలి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీనిని అదునుగా భావించిన ఫ్రాన్సిస్ ప్రేమించిన మరో యువతిని ఇంటి నుంచి అపహరించి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
తనపై పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు వెనక్కి తీసుకోలేదని యువతి ఇంటికి యువకుడు నిప్పు పెట్టిన పరారైన ఘటన బాపట్ల మండలం చినబేతపూడి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వరుసకు మరదలయ్యే మైథిలిని వివాహం చేసుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో యువకుడు చౌటా ఫ్రాన్సిస్ అంగీకరించాడు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మరో యువతితో ఫ్రాన్సిస్ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసి మైథిలి నిలదీసింది.
undefined
తనను వివాహం చేసుకోవడానికి అతడు నిరాకరించడంతో రెండు వారాల క్రితం ఆమె ఆత్యహత్యాయత్నం చేసింది. దీంతో యువకుడు దిగివచ్చి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అన్ని లాంఛనాలతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.
ఇంతలో అస్వస్థతకు గురైన మైథిలి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీనిని అదునుగా భావించిన ఫ్రాన్సిస్ ప్రేమించిన మరో యువతిని ఇంటి నుంచి అపహరించి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసిన ఫ్రాన్సిస్ పై వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో మైథిల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేశారు.
తనపై పోలీసులకు చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని మైథిలి కుటుంబ సభ్యుల మీద ఫ్రాన్సిస్ ఒత్తిడి తేగా వారు నిరాకరించారు. కక్ష పెంచుకున్న అతడు చినబేతపూడిలో మైథిలి కుటుంబానికి చెందిన పూరి పాకకు శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో నిప్పు పెట్టి పరారయ్యాడు. యువతి తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జనార్థన్ శుక్రవారం తెలిపారు.