జశ్వంత్ ఫ్యామిలీని పరామర్శించిన హోంమంత్రి సుచరిత.. రూ.50 లక్షల చెక్ అందజేత...

By AN Telugu  |  First Published Jul 10, 2021, 11:57 AM IST

హోంమంత్రి సుచరిత జశ్వంత్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. 


గుంటూరు జిల్లా : వీర జవాన్ జశ్వంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత నివాళులర్పించారు. బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంఛనాలతో జరిగిన జశ్వంత్‌ అంత్యక్రియలకు హోంమంత్రి హాజరయ్యారు. 

హోంమంత్రి సుచరిత జశ్వంత్‌ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీర జవాన్ జశ్వంత్ కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. 

Latest Videos

అమర జవాన్ జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్ ను హోంమంత్రి అందజేశారు. అతి చిన్నవయస్సులో జశ్వంత్‌ మరణించడం చాలా బాధాకరమన్నారు.

జవాన్ జశ్వంత్ పార్థివ దేహానికి ఘన నివాళి.. (వీడియో)

దేశ రక్షణ కోసం జశ్వంత్‌ రెడ్డి చేసిన త్యాగం మరువలేనిదని సుచరిత అన్నారు. దేశ సేవలో ప్రాణాలర్పించిన జశ్వంత్‌ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఎప్పుడూ అండగా ఉంటామన్న హోంమంత్రి భరోసా ఇచ్చారు.

హోంమంత్రి తో పాటు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని, జెసి దినేష్ కుమార్ లు జశ్వంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

click me!