విజయనగరంలో కోవిడ్ వచ్చినట్టుగా 30 శాతం మందికి తెలియదు:ఏపీలో కరోనాపై సీరో సర్వే

By narsimha lodeFirst Published Sep 11, 2020, 1:08 PM IST
Highlights

సీరో సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా లక్షణాలు కన్పించకుండానే వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో నమోదైనట్టుగా ఈ సర్వే తేల్చింది. 

అమరావతి: సీరో సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా లక్షణాలు కన్పించకుండానే వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో నమోదైనట్టుగా ఈ సర్వే తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మందికి కరోనా వచ్చి పోయినట్టుగా ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయిఈ సర్వే ఫలితాలను ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ విడుదల చేశారు. 

ఏపీ రాష్ట్రంలో గురువారం నాటికి ఐదు లక్షలకు పైగా  కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర జనాభాలో 19.7 శాతం మందికి కరోనా సోకి తగ్గినట్టుగా ఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది ఆగష్టు మాసంలో సీరో సర్వే మొదటి విడత ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండో విడత సర్వే ఫలితాలను గురువారం నాడు విడుదల చేశారు.

తొలి దశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కరోనాపై సీరో సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 15.7 శాతం మందికి కరోనా వచ్చి పోయిన విషయం చాలా మందికి తెలియదని తేలింది. 

రెండో దశలో భాగంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో సర్వే నిర్వహించారు. విజయనగరం, కర్నూల్, శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్టణం,కడప,గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సీరో  సంస్థ కరోనాపై సర్వే నిర్వహించింది.

ఒక్కో జిల్లాలో 5 వేల మంది 45 వేల మంది 45 వేల  శాంపిల్స్ ను సేకరించారు. వీరిలో 19.7 శాతం మందికి కరోనా సోకి రికవరీ అయినట్టుగా తేలింది. వైరస్ సోకినట్టుగా వీరిలో ఎవరికీ కూడ లక్షణాలు లేవు. విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 30.6 శాతం మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందినట్టుగా ఈ సర్వే రిపోర్టు తేల్చింది.

also read:ఏపీలో సీరో సర్వే షాకింగ్ సర్వే: 19 శాతం మందికి కరోనా సోకినట్టుగా తెలియదు

కర్నూల్ జిల్లాలో 28.1 శాతం, శ్రీకాకుళంలో 21.5 శాతం, చిత్తూరులో 20.8 శాతం, విశాఖపట్టణంలో 20.7, కడపలో 19.3 శాతం, గుంటూరులో 18.2 శాతం, ప్రకాశంలో 17.6శాతం, పశ్చిమగోదావరిలో 12.3 శాతం మందిలో యాంటీ బాడీస్ వృద్ధి చెందాయని ఈ సర్వే  తేల్చింది.

ఈ సర్వే ఆధారంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. ఆయా జిల్లాల్లో కరోనా ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు, కొత్తగా కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కేంద్రీకరించనున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని సర్వే రిపోర్టు ప్రకారంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం, కడప జిల్లాల్లో కూడ కరోనా ఉధృతి పెరిగే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. విజయనగరం, కర్నూల్ జిల్లాల్లో కరోనా కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయని సర్వే రిపోర్టు ప్రకారంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
 

click me!