కరోనాపై పుస్తకం... వాలంటీర్ల ద్వారా ఇంటింటికి: విజయసాయి రెడ్డి

By Arun Kumar PFirst Published Sep 11, 2020, 12:30 PM IST
Highlights

ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చేయాల్సినవన్నీ చేస్తోందని... ప్రజలు కూడా ఈ మహమ్మారి పట్ల జాగ్రత్త వహించాలని ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు. 

విశాఖపట్నం: దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంద్రప్రదేశ్ లో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని కరోనా టెస్టులు ఏపీలో జరుగుతున్నాయని తెలిపారు. ఇక కరోనా విషయంలో విశాఖ జిల్లా అధికారులు కూడా చాలా కష్టపడి పని చేసారంటూ విజయసాయి అభినందించారు. 

''ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చేయాల్సినవన్నీ చేస్తోందని... ప్రజలు కూడా ఈ మహమ్మారి పట్ల జాగ్రత్త వహించాలి. కరోనా విషయంలో ఎటువంటి జాగ్రత్తలో తీసుకోవాలో సూచిస్తూ ఓ పుస్తకాన్ని ప్రభుత్వం ప్రచరించినట్లు... వాలంటీర్లు ద్వారా ప్రతి ఇంటికి ఈ పుస్తకాన్ని చేరవేస్తాం'' అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

read more  కరోనా రాకుండా మందు అని చెప్పి.. తండ్రికి విషమిచ్చి..

''ఇక విశాఖ పరిపాలన రాజధానిగా మారనున్ను నేపధ్యంలో భూములు రేట్లు బాగా పెరిగాయి. కాబట్టి ప్రభుత్వ భూమిని ఎవ్వరైనా ఆక్రమించినట్లు తెలిస్తే ప్రజలు అధికారులకు తెలియజేయండి.  భూమి ఆక్రమణలకు పాల్పడితే ఎంత పెద్ద వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటాం.  ప్రభుత్వ భూములు అక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది'' అని వియజసాయి సూచించారు. 

click me!