పవన్ కు ఎెందుకు నచ్చానో, మాది పీఎసీ: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Oct 29, 2019, 04:56 PM ISTUpdated : Oct 29, 2019, 05:41 PM IST
పవన్ కు ఎెందుకు నచ్చానో, మాది పీఎసీ: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

పవన్ కళ్యాణ్ విషయంలో ఉండవల్లి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ మధ్య ఉన్నదీ పీఏసీ అని పేర్కొన్నారు. పీఏసీ కి నూతన నిర్వచనం చెబుతూ,తమ మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. 

పీఏసీ- దీనికి మనకు తెలిసిన అర్థం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. కానీ దీనికి ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. పీఏసీ అంటే పరస్పర అభినందన కమిటీ అని ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ అన్నాడు. పవన్ కళ్యాణ్ తన పట్ల చూపించిన అభిమానం తనకు నచ్చిందని అందుకే తాను కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానాయిస్తానని అన్నాడు. మా ఇద్దరి మధ్య ఉండే బంధమే పీఏసీ అని చెప్పుకొచ్చారు. 

నిన్నఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి ఈ కామెంట్స్ చేసారు.  పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని జగన్ సర్కార్ పాలన ఎలా సాగుతుందనే అనేక అంశాలపై మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి జన సేన గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసారు. 

Also read: చిరు ఎఫెక్ట్: చంద్రబాబు కన్నా ముందే పవన్, జగన్ తో..

పవన్ కళ్యాణ్ కి తాను ఎందుకు నచ్చానో తెలీదు కానీ తన మీద పవన్ ఆప్యాయత చూపెట్టాడని అన్నాడు. అభిమానం చూపెట్టి తనను మాజీ ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశానికి పిలిచి అక్కడ తనను వారి మధ్యలో కూర్చోబెట్టి గౌరవం ఇచ్చాడని ఉండవల్లి అన్నాడు. పరస్పరం ఒకరంటే ఒకరికి గౌరవం,అనురాగం ఆప్యాయత ఉన్నాయని అన్నాడు. 

ఎన్నికల్లో జన సేన ఎందుకు ఓడిందో ఉండవల్లి వివరించారు. పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోగలిగిందన్నాడు. చంద్రబాబు, పవన్ ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల జనసేన ఓటమి చెందాల్సి వాచిందన్నాడు. 

పవన్ కల్యాణే స్వయంగా రెండు సీట్లలో ఓడిపోవడం గురించి ప్రశ్నించగా ఓడిపోయినా తరువాత విషయాల గురించి ఆలోచించాలని అన్నారు. ఓటమి చెందిన తరువాత కొద్దీ సేపట్లోనే ఆ బాధను మర్చిపోయి రెట్టించిన ఉత్సవాహంతో తన రాజకీయ పయనాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 

Also read: ఐదేళ్లు ఉంటారనుకోవద్దు, ముందే ఎన్నికలు రావొచ్చు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ దెగ్గరున్న స్పోర్ట్స్మన్ షిప్, స్పోర్టింగ్ స్పిరిట్ తనకు చాల బాగా నచ్చుతాయని ఉండవల్లి అన్నాడు. ఓడిపోయినా ఆ ఓటమికి కుంగిపోకుండా తిరిగి నిలబడ్డాడని,ఇది చాల గొప్ప విషయమని అన్నాడు. పవన్ కళ్యాణ్ లో ఉన్న ఈ క్వాలిటీ చాల ఉన్నతమైనదని అన్నాడు. 

విభజన గురించి కోర్టులో నడుస్తున్న వాదనలను గురించి ప్రశ్నించగా, అందరూ ఆంధ్ర ప్రదేశ్ విభజన అన్యాయం అని చెబుతున్నప్పటికీ, రాష్ట్రప్రభుత్వం మాత్రం దాని గురించి లేవనెత్తడంలేదని అందుకోసమే నేను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుకు రిప్లై ఇవ్వవలిసిందిగా కోరానని అన్నాడు. 

ఆంధ్రప్రదేశ్ కు జరిగింది న్యాయమో అన్యాయమే పార్లమెంటులో మంచి డిబేట్ కు తెర తీసే ఆస్కారముందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ ఆ పని చేయడానికి సిద్ధంగాలేవని అన్నాడు. ఒకవేళ జనసేన నుంచి ఒక్క ఎంపీ గెలిచి ఉన్నా కూడా తాను ఆ సదరు ఎంపీ తోని ఈ విషయమై పార్లమెంటులో చర్చ లేవనెత్తించి ఉండేవాడినని అన్నాడు ఉండవల్లి. 

మొత్తానికి ఇరువురికి మధ్య ఉన్న పీఏసీ కి నూతన నిర్వచనం ఇచ్చిన ఉండవల్లి దానికి తగ్గట్టుగానే పరస్పర అభినందనలు చేసుకుంటూనే ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!