జర్నలిస్ట్ హత్య కేసు: వైసీపీ ఎమ్మెల్యేకు ఎస్పీ క్లీన్ చిట్

By Nagaraju penumalaFirst Published Oct 29, 2019, 4:38 PM IST
Highlights

 జర్నలిస్ట్ హత్య కేసులో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రమేయం లేదని ఎస్పీ నయీం హష్మి స్పష్టం చేశారు. దాడిశెట్టి రాజాకు క్లీన్ చిట్ ఇచ్చారు. 
 

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తులో పురోగతి లభించింది. హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు.  

తుని మండలం సూరవరం గ్రామ పొలిమేరల్లో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అటు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలుు జారీ చేశారు. 

ఇకపోతే జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసుకు సంబంధించి తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాపై ఆరోపణలు వచ్చాయి. సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

హత్యకు సంబంధించి ఆరుగురిపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఆరుగురిపై కేసులు నమోదు చేయగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఏ6గా ఉన్నసంగతి తెలిసిందే. ఇకపోతే కేసు విచారణ కు సంబంధించి తుని రూరల్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ గౌతం సవాంగ్.

అయితే జర్నలిస్ట్ హత్య కేసును సవాల్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ నయిం హష్మి కేసును ఎట్టకేలకు చేధించారు. జర్నలిస్ట్ హత్య కేసులో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రమేయం లేదని ఎస్పీ నయీం హష్మి స్పష్టం చేశారు. దాడిశెట్టి రాజాకు క్లీన్ చిట్ ఇచ్చారు. 

"

పెనుమచ్చు శివరాం కృష్ణ, అల్లాడి బాబ్జి,గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన రమేష్, మాడుగుల దొరబాబులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. హత్యకు డబ్బుల వసూళ్లు, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే కారణమని పోలీసులు నిర్థారించారు. 

 నిందితుల నుంచి హతుడు జర్నలిస్ట్ సత్యనారాయణ పలుమార్లు బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలిందన్నారు. అలాగే నిందితుల వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూర్చి ఇబ్బంది పెట్టడంతో తట్టుకోలేకే హతమార్చారని తెలిపారు.  


 ఈ వార్తలు కూడా చదవండి

జర్నలిస్ట్ హత్యకేసు: వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కేసు నమోదు.

మనం ఏపీలోనే ఉన్నామా....జర్నలిస్ట్ హత్యపై పవన్ దిగ్భ్రాంతి

click me!