సోమిరెడ్డికీ విదేశాల్లో ఆస్తులా !

Published : Dec 24, 2016, 01:47 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సోమిరెడ్డికీ విదేశాల్లో ఆస్తులా !

సారాంశం

ఎంఎల్సీతో పాటు ఆయన కుటుంబసభ్యులపైన మనీల్యాండరింగ్ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వైసీపీ నేత డిమాండ్ చేసారు.

ఎప్పుడూ అవినీతి, అక్రమాలంటూ జగన్ తదితరులపై విరుచుకుపడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్దిలో ఈ కోణం కూడా ఉందా. టీడీపీలో సీనియర్ నేత, నెల్లూరు జిల్లాకు చెందిన ఎంఎల్సీ సోమిరెడ్డి మాటలను వింటుంటే అవినీతికి  వ్యతిరేకంగా మాట్లాడేందుకు పేటెంట్ తీసుకున్నట్లే కనబడుతారు.

 

అలాంటిది వైసీపీ ఎంఎల్ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి అవినీతి సంపాదనపై ఆధారాలతో విరుచుకుపడటం ఆశ్చర్యంగానే ఉంది.

 

కాకానీ ఆరోపణల ప్రకారం సోమిరెడ్డికి సుమారు రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి. ‘ఇదీ సోమిరెడ్డి విదేశాల్లో సంపాదించిన అక్రమాస్తు’లంటూ కాకాని చాలా పత్రాలనే బయటపెట్టారు. మరి ఎప్పడూ తన వద్ద డబ్బులు లేవనే సోమిరెడ్డి బీద మాటలు మాట్లాడుతుంటారని పార్టీ వర్గాలు చెబుతుంటాయి.

 

తన కుమార్తె వివాహానికి కూడా చంద్రబాబు వద్ద ధన సహాయం అందుకున్నట్లు పార్టీ నేతలు ఆఫ్ ది రికార్దుగా చెబుతుంటారు.

 

కాకాని బయటపెట్టిన పత్రాల ప్రకారం సోమిరెడ్డికి మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ లో వ్యవసాయ భూమలు, భవనాలు, వ్యాపారాల్లో పెట్టుబడులున్నాయి. తన  పేరుతోనే కాకుండా కుటుంబసభ్యుల పేరుపైన కూడా భారీగానే విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారని కాకానీ ఆరోపించారు.

 

ఎంఎల్సీతో పాటు ఆయన కుటుంబసభ్యులపైన మనీల్యాండరింగ్ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వైసీపీ నేత డిమాండ్ చేసారు.

 

సరే, తనపై వచ్చిన ఆరోపణలను సోమిరెడ్డి తోసిపుచ్చారనుకోండి అది వేరే సంగతి. ఎవరు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని, తాను అక్రమంగా ఆస్తులు కూడబెట్టానని ఒప్పుకోవటానికి ఇదేమీ సత్యకాలం కాదుకదా? సోమిరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావటం బహుశా ఇదే మొదటిసారి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే టిడిపి ‘ముఖ్యుల’పైనే సింగపూర్, మలేషియా, థాయ్ ల్యాండ్, దుబాయ్ ల్లో అక్రమ ఆస్తుల కొనుగోళ్ళ ఆరోపణలు వినబడుతుంటాయో అర్ధంకావటం లేదు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?