బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

By sivanagaprasad KodatiFirst Published Oct 20, 2019, 4:21 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం. బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యం బృందం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ చిక్కుకుని బయటకు వచ్చిన ప్రదేశంలోనే ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం కచ్చులూరు వద్దకు డీప్ వాటర్ డ్రైవర్స్ చేరుకున్నారు. మెరైన్ కెప్టెన్ ఆదినారాయణ సాయంతో వారు ఘటనాస్థలిని పరిశీలించారు. 10 మంది డైవర్స్ నది అడుగు భాగంలోకి వెళ్లి.. బోట్ మునిగిపోయిన ప్రాంతంలో నదీ గర్భం ‘‘V’’ ఆకారంలో ఉందని తెలిపారు.

మరలా పైకి వచ్చి ఐరన్ రోపు తీసుకుని బోట్‌ను బంధించేందుకు ఆక్సిజన్ మాస్కులు ధరించిన డైవర్స్ బోటు మునిగిన ప్రాంతానికి డైవర్స్ దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బోటు సాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.. బోటు ముందు భాగంలో బరువు ఎక్కువగా ఉన్నందున ముందు వైపున లంగర్ వేసి పైకి లాగాలని యోచిస్తున్నారు.

బోటు వెలికితీతలో పురోగతి: కచ్చులూరులో లంగర్‌కు చిక్కిన రెయిలింగ్‌

మరోవైపు ఆ ప్రాంతంలో బోటు ప్రమాదంలో చనిపోయిన ఓ పాప మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం బోటు కేవలం 38 అడుగుల లోతులో, నది ఒడ్డుకు 180 అడుగుల దూరంలో ఉన్నట్లు సమాచారం.

బోటును మరో ఇరవై మీటర్లు ఒడ్డుకు తీసుకొస్తే.. సునాయాసంగా ఒడ్డుకు చేర్చవచ్చునని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే ఆదివారం సాయంత్రమే బోటు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

ఈ బోటును వెలికితీసేందుకు గత నెల చివరివారంలో ధర్మాడి సత్యం బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 22 లక్షల టెండర్ ను ఇచ్చింది. బోటు వెలికితీతలో పాల్గొనే ధర్మాడి సత్యం బృందానికి రిస్క్ కవరేజీని కూడ ప్రభుత్వం కల్పించింది.

ఆచూకీ తెలియని 15 మంది: బోటు వెలికితీతకు ధర్మాడి సత్యం ప్రయత్నం

ఆదివారం నాడు  దుబాసీల బృందం విశాఖ నుంచి దేవీపట్నం చేరుకుంది. అయితే దేవీపట్నం నుంచి కచ్చులూరు వెళ్లేందుకు పోలీసులు వారికి అనుమతివ్వలేదు. దీంతో ధర్మాడి సత్యం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

దుబాసీలు బోటుకు లంగరు తగిలిస్తే బోటును బయటకు తీయడం ఇక సులభం కానుందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.  గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు కోసం గాలింపు చర్యల్లో భాగంగా శనివారం ఓ లైఫ్‌బాయ్‌ దొరికింది. ఇది వాహనాల టైరుకు ఉండే ఓ ట్యూబ్‌ వంటిది. లైఫ్‌ జాకెట్‌ మాదిరిగా ప్రమాద సమయంలో దీన్ని పట్టుకుని ప్రాణాలతో బయటపడవచ్చు. 

మధ్యాహ్నం బోటు కోసం గాలింపు చర్యలు సాగిస్తున్న తరుణంలో  తలలేని మృతదేహం బయటపడింది.అయితే ఈ మృతదేహం ఎవరిదనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు. బోటును వెలికితీస్తే ఆచూకీ గల్లంతైన మృతదేహాలు కూ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

"

click me!