
మంచి ట్రాక్ రికార్డు కలిగిన వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తామంటే సాధరంగా ఆహ్వానిస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్రంలో జరిగిన రెండు ప్రాంతాల్లో ఓటర్లపై జగన్, ముద్రగడ ప్రభావం లేదని తేలిపోయిందని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
నంద్యాల, కాకినాడ ప్రజలు కేవలం అభివృద్ధినే కోరుకున్నారన్నారు. అందుకే టీడీపీ వైపు మెగ్గు చూపారని తెలిపారు. ఈ రెండు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి దిమ్మతిరిగిందని, ఆపార్టీ నేతలకు జగన్ సామర్థ్యంపై పూర్తిగా నమ్మకం పోయిందని పుల్లారావు విమర్శించారు. తమ ప్రభుత్వం అభివృద్ది పనులు మరింత విస్తృతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి