ప్రతిపక్షంలో వుండగా మీ డిమాండే... ఇప్పుడు నెరవేర్చండి: జగన్ కు అచ్చెన్న సూచన

By Arun Kumar PFirst Published Aug 24, 2021, 4:42 PM IST
Highlights

ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు అగ్రిగోల్డ్ బాధితులకు ఒకేసారి అందరికీ ఎందకు పరిహారం ఇవ్వలేకపోతున్నారు అని సీఎం జగన్ ను నిలదీశారు అచ్చెన్నాయుడు. 

అమరావతి: అధికారంలో లేనప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ రెడ్డి ఒకేసారి పరిహారం ఇవ్వాలన్నారు... మరి అధికారంలోకొచ్చి రెండేళ్లైనా ఒకేసారి ఎందుకు ఇవ్వడం లేదు? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితులకు అసలు రూ.4వేల కోట్లు...  వడ్డీతో సహా ఒకేసారి రూ.6 వేల కోట్లు చెల్లించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

''అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.30 వేల కోట్లని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనే అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య దేశం మొత్తానికి సంబంధించినది కాబట్టి ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు. అయినా దేశంలో మొదటిసారి చంద్రబాబు నాయుడే బాధితలు పక్షాన నిలబడి అన్యాక్రాంతం కాకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడారు. చంద్రబాబు 2019లో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు'' అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

''అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఆనాడు జగన్ చెప్పారు. అగ్రిగోల్డుకు చెందిన ఆస్తుల విలువ రూ.30 వేల కోట్ల వుంటుందని ప్రతిపక్షంలో వున్నప్పుడు జగన్ రెడ్డే అన్నారు. రాష్ట్రంలో 19.50 లక్షల మంది బాధితులుండగా వారి  డిపాజిట్ల విలువ రూ.4 వేల కోట్లు. ఇప్పటికి వడ్డీతో కలిపి సుమారు రూ.6 వేల కోట్లు అవుతుంది. చెల్లించాల్సిన మొత్తం కంటే ఆస్తుల విలువే ఎక్కువ'' అని అన్నారు. 

read more  అగ్రిగోల్డ్‌ స్కామ్‌కి చంద్రబాబు సర్కారే కారణం: వైఎస్ జగన్

''గతంలో మీరు డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని ఒకసారి చెల్లించాలని డిమాండ్ చేసిన విషయం గుర్తులేదా? ఇప్పుడు మీరు ఏపీలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.6 వేలు కోట్లు ఒకేసారి చెల్లించండి. ఈ విషయాన్నికోర్టుకు తెలియజేసి అగ్రిగోల్డ్ ఆస్తులను ఏపీ ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవచ్చని గతంలో మీరు చేసిన డిమాండును అమలు పరచండి'' అని అచ్చెన్న సూచించారు. 

''గత రెండేళ్లలో రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆదాయం, మీరు చేసిన రూ.2లక్షల కోట్ల అప్పులు కలిపి రూ.4 లక్షల కోట్లు అయింది. వాటిలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.6వేల కోట్లు ఎందుకు చెల్లించలేకపోయారు.? ఇప్పటికైనా మీరు 19.50లక్షల మంది డిపాజిటర్ల దారులుకు ఒకేసారి చెల్లించి అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం'' అని అచ్చెన్నాయుడు అన్నారు. 

click me!