జనసేనలోకి టీడీపీ ముఖ్య నేత.. చంద్రబాబుకి షాక్

Published : Sep 28, 2018, 04:49 PM IST
జనసేనలోకి టీడీపీ ముఖ్య నేత.. చంద్రబాబుకి షాక్

సారాంశం

ఇప్పటి వరకు చాలా మంది నేతలు పార్టీలు మారగా.. తాజాగా మరో టీడీపీ నేత పార్టీ మారారు.  

ఏపీలో ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతలు జంప్ లు చేస్తున్నారు. ఏ పార్టీ అయితే తమకు సీటు ఇస్తామని హామీ ఇస్తుందో.. ఆ పార్టీలోకి దూకేస్తున్నారు.  ఇప్పటి వరకు చాలా మంది నేతలు పార్టీలు మారగా.. తాజాగా మరో టీడీపీ నేత పార్టీ మారారు.

మాజీ ఎమ్మెల్సీ, పెనుగొండ మాజీ ఎంపీపీ, టీడీపీ రాష్ట్రస్థాయి మాజీ నాయకుడు మల్లుల లక్ష్మీనారాయణ గురువారం జనసేన పార్టీలో చేరారు. ఏలూరులో జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో మల్లుల చేరారు. ఆయనతో పాటు సిద్ధాంతం సొసైటీ అధ్య క్షుడు కలగ ప్రసాద్‌ జనసేనలో చేరారు.
 
మల్లుల తెలుగుదేశంలో బలమైన నాయకుడిగా ఎదిగి రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు, ఎంపీపీ, ఎమ్మెల్సీగా పనిచేశారు. పెనుగొండ అసెంబ్లీ స్థానానికి గతంలో పోటీచేసి ఓటమి చవిచూశారు. తర్వాత వైసీపీ చేరినా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేరు. చివరకు జనసేనలో చేరారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మల్లుల చేరికతో ఆచంట నియోజకవర్గంలో జనసేనకు బలం లభించిందని జనసేన కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పెనుగొండ మీదుగా ర్యాలీగా ఏలూరు వెళ్లి జనసేనలో చేరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్