ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యను గెంటేసిన భర్త

Published : Sep 28, 2018, 02:45 PM IST
ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యను గెంటేసిన భర్త

సారాంశం

ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు ఓ భర్త. భార్య, పసికందుపై కనికరం లేకుండా ఇదర్నీ ఇంట్లోంచి గెంటేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. 

విజయవాడ: ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు ఓ భర్త. భార్య, పసికందుపై కనికరం లేకుండా ఇదర్నీ ఇంట్లోంచి గెంటేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే షబానా అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్లకు జన్మనివ్వడంతో భర్త రబీవుల్లా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కూతురు పుట్టిందని షబానాను ఇంట్లో నుంచి గెంటేశాడు. 

భర్తను ఆమె ఎంత బ్రతిమిలాడిని వినకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బాధితురాలు షబానా ఆందోళనకు దిగింది. దీంతో స్ధానికులు పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు షబానా ఇంటికి చేరుకున్నారు. 

పోలీసులు రావడంతో షబానా భర్త రబీవుల్లా అతని తల్లి షాకిర పరారయ్యారు. షబానా తల్లిదండ్రులు తమ కుమార్తెకు న్యాయం చెయ్యాలని పెనమలూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే