చంద్రబాబును తరిమి తరిమి కొడతాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published : Sep 28, 2018, 02:48 PM IST
చంద్రబాబును తరిమి తరిమి కొడతాం :  మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బిజెపి నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీవ్ర విమర్శలు చేశారు.  గతంలో మర్రి చెన్నారెడ్డి వంటి ముఖ్యమంత్రినే తరిమిన చరిత్ర తమదని... ఇప్పుడు చంద్రబాబును తరిబి కొట్టడం కష్ట కాదని అన్నారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ నిర్వాసితులను ఆదుకోకుంటే అంతపని చేస్తామని మాణిక్యాలరావు హెచ్చరించారు.

పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లి గూడెంలో విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పట్టాలు ఇస్తామని గతంలో టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మాట తప్పి నిర్వాసితులకు పట్టాలివ్వడానికి వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. 

శుక్రవారం మాణిక్యాలరావు భూ నిర్వాసితులతో కలిసి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఘాటుగా హెచ్చరించారు. వెంటనే వీరికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరుగుతున్నఈ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించి రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిర్వాసితులు తిరగబడితే మీరు తట్టుకోలేరని అన్నారు. 

అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత్వంతో పోరాడతామని మాణిక్యాలరావు హెచ్చరించారు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి చూద్దాం అంటూ మాణిక్యాలరావు సవాల్ విసిరారు.  
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్