పక్కా స్కెచ్: దర్శిలో నెల రోజుల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ

Published : Sep 30, 2020, 05:17 PM IST
పక్కా స్కెచ్: దర్శిలో నెల రోజుల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ

సారాంశం

ప్రకాశం జిల్లా దర్శిలో నెల రోజుల వయస్సున్న పసిపాపను ఓ మహిళ బుధవారం నాడు కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో నెల రోజుల వయస్సున్న పసిపాపను ఓ మహిళ బుధవారం నాడు కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలోని పోలేపల్లికి చెందిన మరియకుమారికి మాయా మాటలు చెప్పి ఓ మహిళ నెల రోజు పసిపాపను కిడ్నాప్ చేసింది. తాను ఏఎన్ఎం అంటూ మరియకుమారికి పరిచయం చేసుకొంది. తాను ఈ ఊరికి కొత్తగా బదిలీపై వచ్చినట్టుగా చెప్పింది. 

బాలింతలకు సీఎం జగన్ డబ్బులు ఇస్తున్నాడని ఆమె చెప్పింది. మరియకుమారితో పాటు నలుగురు మహిళలను తీసుకొచ్చింది. అయితే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకాలను తీసుకురావాలని చెప్పింది.అంతేకాదు చిన్నారికి ఆసుపత్రిలో ఇంజెక్షన్ వేయించిన తర్వాత మరియకుమారిని ఫోటోలు అడిగింది. ఫోటోలు దిగి తీసుకురావాలని ఒత్తిడి తెచ్చింది.

అప్పటి వరకు పాపను తాను జాగ్రత్తగా చూసుకొంటానని చెప్పింది. ఆమె మాటలు విన్న మరియకుమారి ఫోటోలు దిగి  వచ్చే సరికి తన బిడ్డతో పాటు ఆమ మహిళ కన్పించకుండా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం