ఆయుధాల అక్రమ కొనుగోలు: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత

Published : Sep 30, 2020, 03:24 PM IST
ఆయుధాల అక్రమ కొనుగోలు: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత

సారాంశం

ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తనపై కేసు నమోదు కాకుండా అరెస్ట్ జరగకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు కొట్టివేసింది.

అమరావతి: ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తనపై కేసు నమోదు కాకుండా అరెస్ట్ జరగకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు కొట్టివేసింది.

కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలని హైకోర్టు అభిప్రాయపడింది. గైడ్ లైన్స్ ను ప్రభుత్వం పాటించకపోతే కోర్ఠు ధిక్కరణ కిందకు వస్తోందన్నారు. 

ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై  కేసు నమోదు కాకుండా అరెస్ట్ జరగకుండా  ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ ను ఇవాళ ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు.చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయిల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని  ఏబీ వెంకటేశ్వరరావుపై  ప్రభుత్వం చర్యలు తీసుకొంది.ఆయనను విధుల నుండి తప్పించింది. సస్పెన్షన్ వేటేసింది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu