జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం: రఘురామ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Sep 30, 2020, 3:43 PM IST
Highlights

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్లపై తాను చేసిన వ్యాఖ్యలు అపార్థం చేసుకుంటున్నారని అన్నారు.

న్యూఢిల్లీ: పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మతవ్యాప్తికే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన ఉద్యోగాలు రావని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. క్రిస్టియానిటీ అనేది కుల, మతాలకు అతీతమైందని ఆయన అన్నారు. పేదవారిని ప్రలోభపెట్టి మతమార్పిడులకు ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. 

రెడ్లపై తాను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ఆయన అన్నారు. రెడ్డి అనేది ఓ టైటిల్ అని ఆయన అన్నారు. రెడ్డి సామాజిక వర్గం అంటే తనకు గౌరవం ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి నుంచి తనను తొలగిస్తారని అనుకోవడం లేదని చెప్పారు. తనను తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలను కోరినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. 

సినీ నిర్మాత అశ్వినీదత్ కు రూ. 200 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆయన అన్నారు. రాజధానిని మారిస్తే అమరావతి ప్రాంత రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో కోర్టు తీర్పు శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.  

click me!