ప్రకాశం : ఆర్టిసి బస్సు-లారీ ఢీ... డ్రైవర్ మృతి, 12 మందికి గాయాలు

Published : Jul 09, 2023, 11:27 AM ISTUpdated : Jul 09, 2023, 11:32 AM IST
ప్రకాశం : ఆర్టిసి బస్సు-లారీ ఢీ... డ్రైవర్ మృతి, 12 మందికి గాయాలు

సారాంశం

ఆగివున్న లారీని ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందగా 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం : ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా 12మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

కాకినాడ నుండి కర్నూల్ కు వెళుతున్న ఆర్టిసి బస్సు ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బస్సు త్రిపురాంతకం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో ఓ లారీని ఢీకొట్టింది. అదుతప్పిన బస్సు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయిన ఆర్టిసి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో 12మంది ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 

 ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులను మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. 

Read More  అదిలాబాద్ గుడిహత్నూర్ వద్ద రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ఇదిలావుంటే శనివారం తెల్లవారుజామున వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆర్టివో తో పాటు మరొకరు మృతిచెందారు. ఆర్టీవో శివప్రసాద్‌ అలంఖాన్ పల్లె వద్ద విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున విధుల్లో ఉన్న సమయంలో శివప్రసాద్‌తో పాటు కేశవ్ అనే మరో వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవ్ అక్కడికక్కడే మృతిచెందగా.. శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే శివప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. 

PREV
click me!

Recommended Stories

Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu
Gottipati Ravi Kumar: హత్యా రాజకీయాలు చేస్తే వదిలేది లేదు: మంత్రి గొట్టిపాటి| Asianet News Telugu