ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురిపై మణిసింగ్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి దిగాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారంనాడు ఉదయం ఒకే కుటుంబంలో ముగ్గురిపై మణిసింగ్ అనే వ్యక్తి యాసిడ్ తో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరానికి చెందిన తిరుపతమ్మకు సోషల్ మీడియాలో మణిసింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో తిరుపతమ్మ, మణిసింగ్ సహాజీవనం చేస్తున్నారు.
తిరుపతమ్మకు ఇంతకుముందే వివాహమైంది. భర్తతో విడిపోయింది. తిరుపతమ్మకు ఓ బాబు కూడ ఉన్నాడు. మణిసింగ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుండి తనను తిరుపతమ్మ దూరం పెట్టే ప్రయత్నం చేస్తుందని మణిసింగ్ అనుమానిస్తున్నాడు. అదే సమయంలో తిరుపతమ్మకు మరో విహహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మణిసింగ్ ఆగ్రహాంతో ఉన్నాడు.
undefined
శనివారంనాడు రాత్రి తిరుపతమ్మ ఇంట్లోనే ఉన్న మణిసింగ్ ఆదివారంనాడు తెల్లవారుజామున తిరుపతమ్మతో పాటు ఆమె కొడుకు , తిరుపతమ్మ బంధువు కూతురిపై యాసిడ్ పోశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను విజయవాడ గొల్లపూడి ఆసుపత్రికి తరలించారు. గొల్లపూడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతమ్మ కుటుంబ సభ్యులపై యాసిడ్ దాడికి దిగిన మణిసింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యాసిడ్ దాడిలో 25 శాతం గాయాలయ్యాయని వైద్యులు గుర్తించారు.