ఉమ్మడి కడప జిల్లాలోని గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
కడప: ఉమ్మడి కడప జిల్లాలోని గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండికోట, తిరుపతి, విశాఖపట్టణంలో సెవెన్ స్టార్స్ హోటల్స్ ను ఒబెరాయ్ సంస్థ నిర్మించనుంది. తొలుత గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం ఇవాళ శంకుస్థాపన చేశారు. పులివెందుల నుండి ఇవాళ ఉదయం సీఎం జగన్ గండికోటకు చేరుకున్నారు. ఒబెరాయ్ హోటల్ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత వ్యూ పాయింట్ ను పరిశీలించారు.
ఈ ఏడాది మార్చి మొదటి వారంలో విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహించింది.ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం , ఒబెరాయ్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. రూ. 350 కోట్ల వ్యయంతో ఏడు స్టార్ హోటల్స్ ను నిర్మాణానికి ఒబెరాయ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం ఇవాళ జగన్ భూమి పూజ చేశారు. ఒబెరాయ్ హోటల్స్ నిర్మించనున్న ఇతర జిల్లాలకు చెందిన కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హోటల్ నిర్మాణానికి ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం జగన్ కు వివరించారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ పనిచేస్తున్నారని కడప జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగంలో కూడ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ముందు చూపుతో వెళ్తున్నారన్నారు. ఈ కారణంగానే గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని పలువురు ప్రజాప్రతినిధులు గుర్తు చేశారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని నిన్ననే సీఎం జగన్ పులివెందులకు చేరుకున్న విషయం తెలిసిందే. గండికోట నుండి సీఎం జగన్ పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల రాణితోపు నగరవనం, గరండాల కెనాల్ డెవలప్ మెంట్ ఫేజ్ -1 పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు.