జగన్‌కు ఆక్టోపస్ సెక్యూరిటీ: రాజధాని, ఇతర ఉద్రిక్తతల నేపథ్యంలో

Siva Kodati |  
Published : Dec 19, 2019, 05:34 PM IST
జగన్‌కు ఆక్టోపస్ సెక్యూరిటీ: రాజధాని, ఇతర ఉద్రిక్తతల నేపథ్యంలో

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులతో పాటు నిఘా ఏజెన్సీల నివేదికల నేపథ్యంలో సీఎంకు ఆక్టోపస్ భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులతో పాటు నిఘా ఏజెన్సీల నివేదికల నేపథ్యంలో సీఎంకు ఆక్టోపస్ భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read:రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు

దీంతో 30 మంది సభ్యులతో కూడిన ఆక్టోపస్ బృందం ముఖ్యమంత్రి కోసం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బుధవారం నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద విధులు చేపట్టింది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా సీఎం ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆక్టోపస్ క్లోజ్డ్ సర్క్యూట్‌లో గట్టి భద్రత కల్పించనుంది.

Also Read:రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌తో కలిసి ఈ విభాగం పనిచేస్తుంది. హోం సెక్రటరీ, డీజీపీ, లా అండ్ ఆర్డర్ ఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో కూడిన కమిటీ సీఎంకు ఆక్టోపస్‌ భద్రత కల్పించాలని సిఫార్స్ చేసింది. 

* OCTOPUS అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్
* ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లోని మెరికల్లాంటి యువకులను ఎంపిక చేసి.. వారికి అత్యున్నత కఠిన శిక్షణ ఇచ్చి ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. 
* మొన్నటి వరకు ఎస్‌పీఎఫ్ పోలీసులతో పాటు గన్‌మెన్లు ముఖ్యమంత్రి జగన్‌‌కు భద్రత పర్యవేక్షించేవారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu