వైకుంఠ ఏకాదశి: వైకుంఠ దర్శనంపై టీటీడీ ఛైర్మెన్‌పై స్పష్టత

By narsimha lodeFirst Published Dec 19, 2019, 5:02 PM IST
Highlights

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తామని  టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుపతి:వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పిస్తామని  టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గురువారం నాడు తిరుమలకు వచ్చిన శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని టీటీడీ ఛైర్మెన్, ఆలయ ప్రధాన అర్చకులు మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి  స్వరూపానంద స్వామితో చర్చించారు. అనంతరం టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. . మరోవైపు ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశంపై స్వరూపానంద స్వామి దృష్టికి అర్చకులు తీసుకొచ్చారు. 

చారిత్రక ఆలయాల్లో  ఏ రకమైన నిర్ణయం తీసుకొన్నారనే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్వరూపానంద స్వామి సూచించారు.  ధార్మిక ప్రచారంలో భాగంగా ప్రతినెలా టీటీడీ తరపున ప్రత్యేక కార్యక్రమం నిర్వహింస్తామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి బుధవారం రాత్రి తిరుమలకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నెల 21వ తేదీ వరకు తిరుమలలోనే విశాఖ పీఠాధిపతి తిరుమలలో నిర్వహించే కార్యక్రమాల్లో  పాల్గొంటారు. 

click me!