నోబెల్ గ్రహీత నోట అమ్మఒడి మాట: జగన్‌పై కామెంట్లు

By Siva KodatiFirst Published Jan 29, 2020, 6:12 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అమ్మ ఒడి పథకంపై నోబుల్ అవార్డ్ గ్రహిత జాన్ బి గుడెనఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అమ్మ ఒడి పథకంపై నోబుల్ అవార్డ్ గ్రహిత జాన్ బి గుడెనఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి పథకాన్ని ఏపీ విద్యాశాఖ ఓవర్సీస్‌లోనూ ప్రచారం చేస్తున్నారు.

భారత్ లాంటి దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయమని జాన్ బి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో మోసేజ్‌ను సోషల్ మీడియాలో ఉంచారు.

Also Read:పులివెందుల, అమరావతిలో ఒకేలా...నాలుగంచెల తనిఖీ విధానం: జగన్ ఆదేశాలు

కాగా మనం ఉపయోగించే ఫోన్లు, కెమెరాల్లోని లిథియమ్ ఇయాన్ బ్యాటరీల్లో క్యాథోడ్‌ను ఆవిష్కరించినందుకు గాను జాన్ బి గుడెన‌ఫ్‌కు 2019లో నోబెల్ అవార్డు దక్కింది.

అమ్మ ఒడి పథకాన్ని ఈ నెల 9న చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు పిల్లలను చదివిస్తున్న ప్రతి పేదింటి తల్లుల ఖాతాలో నేరుగా రూ.15 వేలు జమ చేయడం ఈ పథకం ముఖ్యోద్దేశం.

Also Read:బ్రహ్మణి కి అమ్మఒడి డబ్బులు... సీఎంకి లోకేష్ థ్యాంక్స్.. పోస్ట్ వైరల్

రాష్ట్రవ్యాప్తంగా 42,12,186 లక్షల మంది తల్లులకు, తద్వారా 81,72,224 మంది పిల్లలకు దీని ద్వారా లబ్థి కలగనుంది. ఇందుకోసం రూ.6,318 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే పిల్లలకు ఖచ్చితంగా 75 శాతం హాజరు ఉండాని దీనిని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!