చైనాలో చిక్కుకుపోయిన తెలుగు టెక్కీలను స్వస్థలాలకు రప్పించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
తిరుపతి:చైనాలో చిక్కుకొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను వెంటనే తమ స్వస్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని సాఫ్ట్‌వేర్ కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.
చైనాలోని వూహాన్ నగరంలో 58 మంది తెలుగువాళ్లు ఉన్నారు. టీసీఎల్ కంపెనీ తరపున ట్రైనింగ్ కోసం వూహన్ వెళ్లారు ఉద్యోగులు చైనా దేశంలోని వూహాన్ పట్టణంలో కరోనా వైరస్ పెద్ద ఎత్తున విజృంభించింది. ఇప్పటికే 1400 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఇప్పటికే 41 మంది మృతి చెందారు.
undefined
Also read:కరోనా వైరస్ ఎఫెక్ట్: చైనాలోనే 250 మంది ఇండియన్ స్టూడెంట్స్
చైనాలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఇండియాకు రప్పించాలని సాప్ట్ వేర్ ఇంజనీర్ల కుటుంబసభ్యులు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజాలను కోరారు. తమ వారిని వెంటనే స్వస్థలాలకు పంపించేందుకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సుమారు 96 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు 3నెలల క్రితం చైనాకు వెళ్లారు. 2019 ఆగష్టులోనే 38 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. 58 మంది ఇంకా చైనాలోనే ఉన్నారు. వారిని తిరిగి తమ స్వస్థాలకు రప్పించాలని కోరుతున్నారు.