
సీనియర్ రాజకీయనాయకులకు జనసేన పెద్ద షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో జనసేన పూర్తిగా కొత్త వారికి మాత్రమే టిక్కెట్లు కేటాయిస్తుందని ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికి టిక్కెట్లు ఇస్తే మళ్ళీ మూస ధోరణిలో ఉంటుందన్న ఉద్దేశ్యంతో పూర్తిగా కొత్త వారికి మాత్రమే టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏపి, తెలంగాణాలో 42 లోక్ సభ స్ధానాల్లో 848 మందిని పార్లమెంట్ సమన్వయకర్తలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరందరికీ డిసెంబర్ కల్లా అవసరమైన శిక్షణ పూర్తవుతుందన్నారు. పార్లమెంట్ స్ధాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కూడా రెడ్డి తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకు కమిటీలను ఏర్పాటు చేస్తమాన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్ధాయి కమిటీలను విడతల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.