
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2018లో సర్వేశ్వర్, సోమలను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 9 మంది మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేసింది ఎన్ఐఏ. ఛార్జ్‌షీట్‌లో మావోయిస్ట్ కళావతితో పాటు పలువురి పేర్లు వున్నాయి. మొత్తం 40 మంది పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎన్ఐఏ. ఇన్సార్స్ రైఫిల్స్‌తో ఎమ్మెల్యేపై కాల్పులు జరిపి హత్య చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.
Also Read:కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?
కాగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన అనుచరులతో కలిసి వెళ్తున్నవాహనాన్ని డుంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్ట దగ్గర మావోయిస్టులు అడ్డగించారు. ఆ తర్వాత ఆయనను కిందికి దించి అతి సమీపం దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతోపాటు సివేరి సోమ అక్కడికక్కడే మృతిచెందారు.