టెన్త్, ఇంటర్ పరీక్షల రగడ.. ఇప్పట్లో పెట్టలేం: కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఏపీ విద్యాశాఖ మంత్రి

By Siva KodatiFirst Published Jun 11, 2021, 6:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై దుమారం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. స‌రైన స‌మ‌యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా, ప్ర‌తిప‌క్షాలు, పేరెంట్స్ నుంచి వ్య‌తిరేక‌త వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై దుమారం కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. స‌రైన స‌మ‌యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా, ప్ర‌తిప‌క్షాలు, పేరెంట్స్ నుంచి వ్య‌తిరేక‌త వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో చ‌ర్చించామ‌ని.. ప్ర‌స్తుతం పరీక్షలు పెట్టే ప‌రిస్థితి లేదని స్పష్టం చేశారు.

అఖిల భారత స్థాయిలో పరీక్షలకు సిద్ధం అవడానికి కూడా విద్యార్థులకు సమయం కావాల‌ని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్ర‌మే పరీక్షలు నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని సురేశ్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read:టైం టేబుల్ తో సిద్దంగా వుండండి...: పది, ఇంటర్ పరీక్షలపై అధికారులకు మంత్రి సురేష్ ఆదేశాలు

ఒక తండ్రిగా అయితే తాను పరీక్షల నిర్వహణకు మద్దతిస్తాన‌ని ఆదిమూలపు సురేశ్ తేల్చి చెప్పారు. ఆప్షన్స్ చూడకుండా ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. నారా లోకేష్ లాగా అందరూ దొడ్డి దారిలో మంత్రి పదవులు పొందలేరంటూ ఫైర‌య్యారు. లోకేష్ లాగా అందరికి హెరిటేజ్ లాంటి ఆస్తులు లేవని.. ఎవరో సీటు ఇప్పిస్తే ఆయ‌న‌ స్టాన్‌ఫోర్డ్‌లో చదివారంటూ ఆరోపించారు.

పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమషం పట్టదని.. కానీ తాము విద్యార్థులు భవిష్య‌త్ గురించి ఆలోచిస్తున్నామ‌ని ఆదిమూలపు చెప్పారు. కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ కొత్తగా అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా అడ్మిషన్లు ప్రారంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ హెచ్చరించారు.

click me!