ఏపీలో కరోనా కేసులు: కొత్తగా 8,239 మందికి పాజిటివ్.. తూర్పుగోదావరి, చిత్తూరులో తగ్గని తీవ్రత

Siva Kodati |  
Published : Jun 11, 2021, 06:47 PM IST
ఏపీలో కరోనా కేసులు: కొత్తగా 8,239 మందికి పాజిటివ్.. తూర్పుగోదావరి, చిత్తూరులో తగ్గని తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,239 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,96,122కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,239 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,96,122కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,696కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 6, ప్రకాశం 7, అనంతపురం 5, తూర్పుగోదావరి 5, చిత్తూరు 10, గుంటూరు 2, కర్నూలు 2, నెల్లూరు 2, కృష్ణ 4, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 7  కడపలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 11,135 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,88,198కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,01,863 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,02,39,490కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 96,100 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 698, చిత్తూరు 1396, తూర్పుగోదావరి 1271, గుంటూరు 488, కడప 693, కృష్ణ 462, కర్నూలు 201, నెల్లూరు 407, ప్రకాశం 561, శ్రీకాకుళం 421, విశాఖపట్నం 500, విజయనగరం 254, పశ్చిమ గోదావరిలలో 887 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?