రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సర్కార్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ సమన్లు

By narsimha lodeFirst Published Jun 29, 2021, 4:38 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేసింది.నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. నివేదిక పంపండంలో ఎందుకు జాప్యం అవుతుందని  జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రశ్నించింది. తాజాగా కండిషనల్ సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీలోపుగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

also read:మా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్లుంది జగన్ తీరు: మరో లేఖలో రఘురామ ఎద్దేవా

రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై  ఆయన కొడుకు భరత్ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరును ఈ ఫిర్యాదులో భరత్ ప్రస్తావించారు. రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు కూడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ  ఆదేశాలు జారీ చేసింది.


 

click me!