సినిమాల్లో బిజీగా వున్నారంతే.. చిరంజీవి కాంగ్రెస్‌వాదే: ఉమెన్ చాందీ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ క్లారిటీ

By Siva KodatiFirst Published Jun 29, 2021, 4:00 PM IST
Highlights

సినీనటుడు చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏపీ పీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి సినిమాలతో బిజీగా వుండటంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని కేరళ మాజీ సీఎం, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో పీసీసీ స్పందించింది. 

సినీనటుడు చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏపీ పీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి సినిమాలతో బిజీగా వుండటంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని కేరళ మాజీ సీఎం, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో పీసీసీ స్పందించింది. భవిష్యత్తులో చిరంజీవి పార్టీ కార్యకలాపాల్లో క్రీయాశీలకంగా పాల్గొనే అవకాశం వుందని పీసీసీ తెలిపింది. 

Also Read:`మా` రాజకీయాల్లో `మెగా` ట్విస్ట్.. చిరంజీవిని ఇరకాటంలోకి నెట్టనున్న మహిళా కార్డ్ ?

కాగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గురించి ఉమెన్ చాందీ స్పష్టత ఇచ్చారు. పెట్రోల్‌ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందని చాందీ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఉమెన్ చాందీ స్పందిస్తూ ఆయన పార్టీలో కొనసాగడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ క్లారిటీ ఇచ్చింది. 
 

click me!