NGT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మరో షాక్ తగిలింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.
NGT: పలు కార్యక్రమాలతో దూకుడుగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. జగన్ సర్కారు స్పీడ్ కు National Green Tribunal బ్రేకులు వేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం నాడు National Green Tribunal పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలు పరిగణలోకి తీసుకోకుండా ముందుకు సాగితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎత్తిపోతల పథకం నిర్మాణాలు చేపడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయమై అధ్యయన కోసం.. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే, ప్రాజెక్ట్ నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది.
Also Read: Data protection Bill: పార్లమెంట్ ముందుకు డేటా ప్రొటెక్షన్ బిల్లు.. కీలక అంశాలివిగో..
undefined
National Green Tribunal ప్రస్తావించిన వివరాలు ఇలా వున్నాయి.. కేంద్ర అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి, కేంద్ర జల సంఘం అధికారి సహా.. నలుగురితో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాలని National Green Tribunal తీర్పును వెల్లడించింది. ఏపీ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ బాధ్యత వహించాలని చెప్పింది. National Green Tribunal తీర్పు జగన్ సర్కారుకు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే National Green Tribunal లో ధిక్కరణ పిటిషన్ దాఖలు అయింది.
Also Read: Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ సర్కారు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్ కూడా ఓ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక బృందాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన National Green Tribunal తాజాగా దేశాలు జారీ చేస్తూ తీర్పును వెల్లడించింది. దీనిపై జగన్ సర్కారు వాదనలు వినిపిస్తూ.. పాత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు మెరుగ్గా నీటిని సరఫరా చేయడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామనీ, ఇది కొత్త ప్రాజెక్టు కాదని వాదిస్తోంది. అలాగే, విభజన చట్టం ప్రకారం ఈ ఎత్తిపోతలకు అనుమతిచ్చి, అపెక్స్ కౌన్సిల్‌కు పంపాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎన్‌జీటీ విచారణ అక్టోబర్ లోనే ముగిసింది. అయితే, తన తీర్పును రిజర్వ్ చేసినట్లు ఎన్‌జీటీ ప్రకటించింది. శుక్రవారం దాని తీర్పును వెల్లడించింది.
Also Read: CM KCR: కేంద్రంపై పోరు.. నేడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలపై చర్చ..