జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: అంతా నకిలీల మయం... వాహనాల దాచివేత

Siva Kodati |  
Published : Jun 08, 2020, 09:27 PM IST
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: అంతా నకిలీల మయం... వాహనాల దాచివేత

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు.

బీఎస్ 3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్ 4గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది.

Also Read:లారీ ఓనర్ల ధర్నా, ఉద్రిక్తత: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఛీటింగ్ కేసు

60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగిలిన 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఇదే సమయంలో ఇకపై జేసీ ట్రావెల్స్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు. జేసీ ట్రావెల్స్ చాలా తప్పులు చేస్తూ, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడిందని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ అన్నారు.

Also Read: జేసీ దివాకర్ రెడ్డికి అధికారులు షాక్: ఎలా రియాక్ట్ అవుతారో మరీ

స్క్రాప్ కింద కొనుగోలు చేసిన బస్సులు, లారీలను రోడ్లపై నడపటం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తామని చెప్పారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు