క్వాంటమ్ కంపెనీ బాత్ రూంలో శిశువు కలకలం.. పెళ్లి కాకుండానే తల్లవడంతో..

Published : Oct 26, 2022, 11:41 AM IST
క్వాంటమ్ కంపెనీ బాత్ రూంలో శిశువు కలకలం.. పెళ్లి కాకుండానే తల్లవడంతో..

సారాంశం

పెళ్లి కాకుండానే తల్లి అవ్వడంతో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. తాను పనిచేస్తున్న కంపెనీ బాత్రూంలో ప్రసవించి.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. 

అనకాపల్లి : అచ్యుతాపురం సెజ్ లో అమానుషం జరిగింది. క్వాంటమ్ కంపెనీలోని బాత్ రూంలో శిశువు కలకలం సృష్టించింది. క్వాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళకు ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ మహిళ.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. కంపెనీకి వెళ్లే బస్సుల్లో మహిళ కోసం సిబ్బంది గాలించారు. శిశువును చైల్డ్ లైన్ కు అప్పగించారు. ఈ ఘటన మీద సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

తమిళనాడులో ఒక మహిళా దారుణానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. క్షణిక సుఖం కోసం తెలిసీ, తెలియని వయసులో చేసిన చిన్న పొరపాటు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. తనతో పాటు కడుపుచించుకుని పుట్టిన పసికందుకు లోకం తెలియకముందే నూరేళ్లు నిండేలా చేసింది. తను చేస్తుంది తప్పో, ఒప్పో తెలుసుకునే విచక్షణ కూడా కోల్పోయేలా చేసి.. నేరానికి పాల్పడేలా చేసింది. దీంతో ఇప్పుడా సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో దారుణం.. టాయిలెట్ లో పారేసిన పిండం ల‌భ్యం

తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. కానీ అందులో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురి చేసింది. ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ మృతదేహం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. 

ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అది మెడికల్ కాలేజీ ఆస్పత్రే అయినా ఆ ఆస్పత్రిలో అసలు మెటర్నటీ వార్డు లేదని ఆస్పత్రి వర్గాలు బాంబు పేల్చాయి. మరి ఇంతకీ ఆ పసికందు మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయాక అక్కడ వదిలి వెళ్లారా? లేక బతికుండగానే సజీవంగా సమాధి చేశారా? అని అనుమానాలు మొదలయ్యాయి. 

ఇక ఆస్పత్రి వర్గాలు తమ దగ్గర మెటర్నటీ వార్డు లేదు కాబట్టి ఆ  శిశువు అక్కడ జన్మించే అవకాశం లేదని.. ఇది బయటివారి పనే అయి ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో పోలీసులు ముందు తలలు పట్టుకున్నారు. ఆ తరువాత కేసు విచారణను ముమ్మరం చేయడానికి సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. అందులో అసలు విషయం బయటపడింది.

చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి అరెస్టు చేశారు. ఆమె చెప్పిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.  పోలీసుల కథనం ప్రకారం తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన  ప్రియదర్శిని(23) అనే యువతి పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 

ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందని భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు నిర్ణయించుకుని..  ఆమె దగ్గరలోని తంజావూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్ళింది.  అక్కడ దొంగచాటుగా బాత్ రూమ్ కి వెళ్ళి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో ఆ పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత పెట్టి మూసేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్