హమాలీ కుమారుడికి ఐఐటీలో సీటు.. అనంతపురం కలెక్టర్ చొరవతో పేద విద్యార్థికి అందిన ఆర్థిక సాయం..

By team teluguFirst Published Oct 26, 2022, 11:19 AM IST
Highlights

అనంతపురం కలెక్టర్ ఓ పేద విద్యార్థికి అండగా నిలిచారు. ఐఐటీలో సీటు సాధించిన హమాలీ కుమారుడి చదువుకు అవసరమైన డబ్బులను ఓ డెయిరీ సీఎస్ఆర్ నిధుల ద్వారా అందేలా చేశారు. 

ఆయనో హమాలీ. కుమారుడిని గొప్ప చదువులు చదివించాలని అనుకున్నారు. కుమారుడు కూడా తండ్రి ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి చదివాడు. ఐఐటీ ధన్ బాద్ లో సీటు సంపాదించాడు. కానీ అక్కడికి వెళ్లి చదవాలంటే ఆర్థిక పరిస్థితులు అడ్డువచ్చాయి. ఈ విషయాన్ని ఆ తండ్రి జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. తమ కుమారుడి చదువుకు సాయం చేయాలని కోరుకున్నాడు. దీంతో ఆ కలెక్టర్ స్పందించారు. తన ప్రత్యేక చొరవతో సీఎస్ఆర్ నిధులతో ఆ విద్యార్థి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించారు.

ఎఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతల స్వీకరణ:హాజరైన సోనియా,రాహుల్

వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం బుడేడు గ్రామానికి చెందిన నాగరాజు హమాలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు మోహన్‌కృష్ణ ఐఐటీ-2022లో 1,330వ ర్యాంక్‌ సాధించారు. దీంతో ధన్‌బాద్‌లోని ఐఐటీలో సీటు వచ్చింది. కానీ తండ్రి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన సంపాదించే డబ్బులు రోజు వారి జీవనానికే సరిపోతాయి.

క‌ర్నాట‌క‌పై చ‌లిపులి పంజా.. బెంగ‌ళూరులో ఒక ద‌శాబ్దంలోనే అత్య‌ల్ప ఉష్ణోగ్రతలు !

ధన్‌బాద్‌లోని ఐఐటీలో చదవాలంటే కళాశాల ఫీజు, అక్కడ ఉండేందుకు హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆ పేద తండ్రికి ఆర్థికంగా భారంగా మారాయి. దీంతో నాగరాజు కొద్ది రోజుల క్రితం జరిగిన ఫిర్యాదుల సమావేశంలో అనంతపురం కలెక్టర్‌ ఎస్.నాగలక్ష్మి ని కలిశారు. తన పరిస్థితిని, కుమారుడు సాధించిన సీటు విషయాన్ని తెలియజేశారు. కుమారుడి చదువుకు సాయం చేయాలని కోరారు. 

ఏపీ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

దీంతో కలెక్టర్ స్పందించారు. ప్రత్యేక చొరవతో ఆ విద్యార్థి చదువు విషయాన్ని అనంతపురంలోని గాయత్రి మిల్క్ డెయిరీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దాని జనరల్ మేనేజర్ నాగరాజ రావు డెయిరీ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఆ విద్యార్థి ఫీజు చెల్లింపుల కోసం రూ.70 వేల చెక్కును  అందించేలా చేశారు. నిరుపేద  విద్యార్థికి అండగా నిలిచినందుకు కలెక్టర్‌ గాయత్రి మిల్క్ డెయిరీ నిర్వాహకులను అభినందించారు. విద్యార్థికి సాయం అందేలా చేసిన కలెక్టర్ తీరును జిల్లా వాసులు ప్రశంసిస్తున్నారు. 

click me!