అసెంబ్లీ వాస్తు బాగాలేదా?

First Published Mar 7, 2017, 11:33 AM IST
Highlights

వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనం వాస్తు బాగాలేదా? ఎందుకంటే, సభా నాయకుడికి, సభాపతికి వరుసపెట్టి కోర్టు నోటీసులందాయి.

వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనం వాస్తు బాగాలేదా? ఎందుకంటే, సభా నాయకుడికి, సభాపతికి వరుసపెట్టి కోర్టు నోటీసులందాయి. దాంతో అందరికీ అసెంబ్లీ వాస్తుపై అనుమానాలు మొదలయ్యాయి. వరుస నోటీసులతో టిడిపి పెద్దలకు కష్టాలు మొదలయ్యాయా అన్న చర్చ జోరందుకున్నది. నిన్నేమో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు నుండి నోటీసులు. ఈరోజేమో కరీంనగర్ కోర్టు నుండి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు నోటీసులు. రెండు రోజుల్లో ఇద్దరు పెద్దలకు వరుసగా నోటీసులు రావటంతో పార్టీలో కలకలం మొదలైంది. అసలేం జరుగుతోందో అర్ధంకాక నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరికీ కోర్టుల నుండి నోటీసులు రావటంతో అసెంబ్లీ వాస్తు  బావోలేదేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి అందరిలోనూ.

 

విచిత్రమేమిటంటే, ఓటుకునోటు కేసులో స్వయంగా ఎంఎల్ఏతో మాట్లాడి చంద్రబాబునాయుడే నేరుగా తగులుకున్నారు. అంతుకుముందు డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి వీడియో సాక్ష్యంగా దొరికిపోయారు. కాబట్టి ఓటుకునోటు కేసు సహజంగా చంద్రబాబుకు ఇబ్బందే. ఏదో ఇంత కాలం గ్రహబలంతో నెట్టుకోచ్చేసారు. అదే విధంగా ఎన్నికల్లో తాను రూ. 11 కోట్లు వ్యయం చేసినట్లు స్వయంగా ఓ ఇంటర్యూలో కోడెలే చెప్పారు. అంటే ఇక్కడ కూడా వీడియో, ఆడియో సాక్ష్యాల ప్రకారం కోడెలకు ఇబ్బందే. ఇదే విషయమై కోడెలకు గతంలో ఎన్నికల కమీషన్ కూడా నోటీసులు ఇచ్చినా పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనబడలేదు. తాజాగా కరీంనగర్ కోర్టు జారీ చేసిన నోటీసులతో కోడల పరిస్ధితి ఏమటనే విషయమై సర్వత్రా చర్చ మొదలైంది.

click me!