టిడిపినికూడా ఆకట్టుకున్న జగన్ ప్రసంగం

First Published Mar 7, 2017, 8:44 AM IST
Highlights

టిడిపి సభ్యులు ఈ రోజు సభ వాయిదా పడేంత గొడవ కూడా చేయలేకపోయారు. వాళ్లూహించని విషయాలు జగన్ లెవనెత్తారు. చివరకు స్పీకర్ సభని వాయిదా వేశారు.

రాష్ట్ర అభివద్ది ఒక దేవరహష్యంగా ఉందని ప్రతిపక్ష నాయకుడు జగన్మహన్ రెడ్డి అన్నారు. ఒక వైపు రాష్ట్రం విభజన వల్ల దెబ్బతనిందంటున్నారు. మరొక వైపు 10 శాతం ఎస్జిడిపి పెరిగిందంటున్నారు. ఇదెలా సాధ్యమయిందో చెప్పమ టే 2051 నాటి  లెక్కలు చూపిస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది అయిదేండ్లకు, మీరు లెక్కలేస్తున్నది 20 51కి. ఇదేమి లెక్క. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ ప్రభుత్వం చెబుతున్న వృద్ధి రేటు ఈ వ్యాఖ్యలు చేశారు.

**

ఈ రోజు జగన్ ప్రసంగం అధికారపక్షాన్ని కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా  పట్టిసీమనుంచి తోడి ని నీళ్లేమయ్యాయో చెప్పిన తీరు అధికారపక్షాన్ని ఇరుకుపెట్టింది. జగన్ ప్రసంగం టిడిపి ని ఇరుకున పెట్టిన మరొక విషయం జి ఎస్ డిపి వివరాలు.   జిఎస్ డిపి అంకెల తో గారడి  చేస్తున్నారనడం వారికి రుచించలేదు.బెంగుళూరు, మద్రాసు వంటి నగరాలున్న రాష్ట్రాలకంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఆంధ్రకి ఎలా సాధ్యమయిందో చెప్పాలని అన్నారు. రాజధాని కూడా లేని రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో చెప్పాలని అన్నారు.

 

చివరకు టిడిపి మూడ్ ని  అర్ధికమంత్రి  యనమల రామకృష్ణుడులేచి ఇలా వ్యక్తీకరించారు.   ఈ లెక్కలు...బాగున్నాయి.  మీకు ట్యూటరింగ్ కూడా బాగుంది అని అన్నారు.  ఇలా అడ్డు తగులుతూ, ‘మరి రైతుల మీద ఇంత ప్రేమ ఉంటే... మీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల రుణమాఫీ అవసరమని లేఖ కేంద్రానికి ఎలా రాశారు’ అని అడిగారు. 

 

జగన్ ఆవేశపడకుండా నిబ్బరంగా, నిదానంగా మాట్లాడటం, వైసిపి నిశబ్దంగా ఉండటంతో ఇబ్బంది పడిన తెలుగుదేశం  సభ్యులు జగన్ ను అడ్డుకుని ఆయన ప్రసంగ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు  మొత్తం ఏడుసార్లు మంత్రులు  అడ్డుకున్నారు.  అడ్డుకుని ఇక  మీ టైం అయిపోయిందని వాదించడం మొదలు పెట్టారు.

**

సభలో ఈ రోజు టిడిపి పెద్దగా గొడవ చేయలేకపోయింది. టిడిపి షౌటింగ్ బ్రిగేడ్ మౌనంగా ఉండిపోయింది.  కారణం ఆయన లేవనెత్తిన అంశాలను ఖండించలేకపోవడమే. అసలు ఈ విషయాలను, ఈ లెక్కలను జగన్ ప్రస్తవిస్తాడని వాళ్లెవరూవూహించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా జాగత్రగా గమనిస్తూ, వింటూ ఉండిపోయారు. చివరకు స్పీకర్ సభను వాయిదా వేయడంతో జగన్ ప్రసంగానికి అడ్డుకట్టపడింది.

 

 

 

click me!