కోటంరెడ్డి కోపం:  గంటలో దిగివచ్చిన అధికారులు

Published : Feb 10, 2017, 09:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కోటంరెడ్డి కోపం:  గంటలో దిగివచ్చిన అధికారులు

సారాంశం

ఎమ్మెల్యేలంతా నెలలో ఒకటి రెండు రోజులు ఇలా శ్రద్ధ తీసుకుంటే వూర్లన్నీ బాగుపడవూ?

ఈ రోజూ  ఎప్పటిలాగా నియోజకవర్గం రౌండ్లలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డికి మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల మీద తెగ కోపం వచ్చింది. ప్రజల ఫిర్యాదులు, తాను తిరుగుతున్న ప్రాంతంలో పారిశుధ్యత లేకపోవడాన్ని గమనించి, వెంటనే అధికారులకు ఫోన్ చేసి అల్టిమేటంజారీ చేశారు.

 

    “గంట టైం ఇస్తున్నాను. నేనున్న చోటికి వెంటనే వచ్చి, మురుగు కాల్వలనుంచి తీసేసిన చెత్త ఎత్తేసి, తీసిన గుంతలు వెంటనే పూడ్చాలి. లేకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి,” అని హెచ్చరించారు.

 

అంతే అరగంటలో అధికారలు పరిగెత్తుకుంటూ వచ్చి,   క్షమాపణలు చెప్పి, పరిసరాలను శుభ్రం చేయడం మొదలుపెట్టారు.

 

ఈ సంఘటన ఈ రోజు నెల్లూరు 30వ డివిజన్ లోని గాంధీనగర్ లో జరిగింది.  ఆయన గాంధీనగర్, , సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతాల్లో ప్రజాబాట నిర్వహించారు.తమ ప్రాంతాన్ని మునిసిపల్ అధికారలు నిర్లక్ష్యం చేయడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను స్థానికులు శ్రీధర్ రెడ్డి దృష్ఠికి తీసుకొచ్చారు. ఆయన స్వయంగా పరిసరాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కార్పొరేషన్ అధికారులకు ఫోన్ చేసి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

పారిశుధ్యత విషయంలో కార్పొరేషన్ ఇలా నిర్లక్ష్యంగా ఉన్నందునే నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందని, గంట సేపటిలో  మురుగు కాలువ నుంచి తీసిన చెత్తను శుభ్రం చేయకపోతే, తానే పూడిక తీసి, మట్టిన కార్పొరేషన్ కార్యాలయంలో వేయిస్తానని ఆయన అల్టిమేటం  ఇచ్చారు. గంటలోపు ఈ ప్రాంతంలో పారిశుధ్య పనులు చేపట్టి తీరాల్సిందే నని అన్నారు.  

 

అనంతరం ఆయన మాట్లాడుతూ పైప్ లైనుల  పనుల కోసం ఎక్కడ బడితే అక్కడ గుంతలు తీశారని, వాటిని పూడ్చలేదని ఆయన ఆరోపించారు. ఈ గుంతలు పూడ్చక పోవడంతో  తాము బాగాఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీని వల్ల ప్రజలు ఇబ్బందలు పడుతున్నా కార్పొరేషన్ పట్టించుకోలేదని చెబుతూ అధికారలపై అగ్రహం వ్యక్తం చేశారు. తవ్విన గుంతలుపూడ్చకపోతే వూరుకునేది లేదని, పారిశధ్యపు పనులు అమావాస్యకో పున్నానికో చేస్తే వూరుకునేది లేదని  ఆయన హెచ్చరించారు.

 

ఎమ్మెల్యేలంతా నెలలో ఒకటి రెండు రోజులు ఇలా శ్రద్ధ తీసుకుంటే వూర్లన్నీ బాగుపడవూ?

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu