
వచ్చే ఎన్నికలను పవన్ సీరియస్గానే తీసుకున్నట్లు కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అంతర్జాతీయ సలహాలు తీసుకోవటంతో పవన్ లోని సీరియస్నెస్ తెలుస్తోంది. ఇందుకోసం అమెరికాలోని స్టీవ్ జార్డింగ్ తో శుక్రవారం రెండు గంటల పాటు పవన్ సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో ఏపిలో జరగబోయే ఎన్నికలు ఎలా వుండబోతున్నాయో వివరించారట. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి ఎత్తుగడులు వేయాలి, అభ్యర్ధుల ఎంపికలో అనుసరించాల్సిన విధానాలేమిటి అనే విషయాలను జార్డింగ్ విశ్లేషించినట్లు సమాచారం.
వీలైతే, వచ్చే ఎన్నికలకు ముందు ఓ సారి జార్డింగ్ ను రాష్ట్రానికి రావల్సిందిగా పవన్ కోరారట. అంటే, జార్డింగ్ రాష్ట్రంలో పర్యటిస్తారేమో. ప్రస్తుతం జార్డింగ్ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనెడీ స్కూల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలోని రాజకీయ పార్టీలతో పాటు విదేశాల్లోని రాజకీయ పార్టీలకు కూడా సలహాలు ఇస్తుంటారట. ఉత్తరప్రదేశ్ లోని ఎన్నికల్లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎక్కువగా సలహాలు తీసుకుంటారని జనసేన పార్టీ చెబతోంది. జార్డింగ్ చేసిన సూచనలనే ప్రస్తుతం అఖిలేష్ అనుసరిస్తున్నారట. మరింకేం కొద్ది రోజుల్లోనే జార్డింగ్ ప్రతిభ ఏమిటో తెలిసిపోతుంది కదా.