నెల్లూరులో దారుణం.. ఇంటర్ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

Published : Mar 21, 2022, 09:56 AM IST
నెల్లూరులో దారుణం.. ఇంటర్ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.    

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని కారణంతో ఇంటర్ విద్యార్థిని గొంతుకోశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. వివరాలు.. సోమవారం ఉదయం కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతిపై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు.తనను ప్రేమించలేదని కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు. వెంటనే జ్యోతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు.

జ్యోతిని ప్రేమిస్తున్నానని చెంచుకృష్ణ కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ విషయాన్ని జ్యోతిక తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయం పోలీసులుకు తెలియజేసినా కూడా స్పందించలేదని బాధితురాలి బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫుడ్ కమీషన్ ఏం చేసింది.? Ap State Food Commission Chairman Chitha Vijay Prathap Reddy
గుడివాడలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో సీఎం | CM Chandrababu Naidu