
పుత్తూరు : పట్టణానికి చెందిన అనంతరాజ్, ప్రసన్న దంపతుల కుమార్తె హాసిని (7) రెండో తరగతి చదువుతోంది. వరల్డ్స్ రికార్డ్ సంస్థ గణిత మేధావి హాసినికి జ్ఞాపిక, పశంసా పత్రం ఆదివారం అందజేసింది. అబాకస్ ద్వారా గణిత సమస్యను రికార్డు స్థాయిలో పూర్తి చేసినందుకు వరల్డ్ రికార్డ్సులో తృతీయ స్థానం సాధించుకున్న విషయం పాఠకులకు విధితమే. చిన్నారి గణిత సమస్యను 37, 63 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ మానసిక గణిత పరీక్షలో 310 మంది పాల్గొన్నారని, అందులో తమ బిడ్ద హాసిని తృతీయ స్థానంలో నలిచినట్లు తల్లిదండ్రులు తెలియజేశారు. వేదవ్యాస విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ బాలసరస్వతి, డైరెక్టర్ నారాయణబాబు చిన్నారిని అభినందించారు.