తల్లీకూతుళ్ల హత్య: హంతకుడికి ఉరిశిక్ష, నెల్లూరు కోర్టు సంచలన తీర్పు

By Siva KodatiFirst Published Feb 6, 2020, 3:12 PM IST
Highlights

నెల్లూరు నగరంలోని హరనాథపురంలోని 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2012లో మెడికో భార్గవి ఆమె తల్లీని ఇంతియాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. 

నెల్లూరు నగరంలోని హరనాథపురంలోని 8వ అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2012లో మెడికో భార్గవి ఆమె తల్లీని ఇంతియాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. దీనిని అడ్డుకోబోయిన భార్గవి తండ్రి దయాకర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

భార్గవి ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేసిన ఇంతియాజ్.. నగలు, డబ్బుపై కన్నేశాడు. ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడే సందర్భంలో భార్గవి, ఆమె తల్లీపై దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో వారిద్దరూ ఘటనాస్థలిలోనే మరణించారు.

సుథీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇంతియాజ్‌కు సహాయపడిన ఇద్దరు మైనర్లకు గతంలోనే శిక్ష ఖరారు చేయగా.. ప్రధాన నిందితుడికి గురువారం ఉరిశిక్ష విధించింది. ఇంటీరియర్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగించే ఇంతియాజ్ గతంలో అనేక కేసుల్లో నిందితుడు.     

భార్గవి తండ్రి దినకర్ ‌రెడ్డి నగరంలోని వాగ్ధేవి డిఫార్మసీ కళాశాల కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్థానిక హరనాథపురం రెండో వీధిలో భార్య, కుమార్తెతో నివాసం ఉంటున్నారు.

భార్గవి నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. హరనాథపురంలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి ఎలివేషన్ ప్లాన్ తయారు చేసేందుకు గాను ఇంతియాజ్‌ను పిలిపించారు. 

Also Read:

సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష... గ్రామస్తులు ఏమంటున్నారంటే

నిర్భయ కేసు: కేంద్రానికి హైకోర్టు షాక్, దోషులకు వారం గడువు

నిర్భయ కేసు దోషుల ఉరితీతపై స్టే: హైకోర్టులో సవాల్ చేసిన కేంద్రం

click me!