కియా సంస్థతో చర్చించలేదు: స్పష్టం చేసిన తమిళనాడు

Published : Feb 06, 2020, 03:09 PM IST
కియా సంస్థతో చర్చించలేదు: స్పష్టం చేసిన తమిళనాడు

సారాంశం

కియా పరిశ్రమ యాజమాన్యంతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

చెన్నై: కియా సంస్థతో తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో  తాము మంచి సంబంధాలను కోరుకొంటున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Also read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఏపీ రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శికి ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కియా కార్ల పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి తరలివెళ్లిపోయే అవకాశం ఉందని  ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 

ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇదే తరహాలో స్పందించింది.  ఈ వార్తల్లో ఎలాంటి సంబంధం లేదని కియా మోటార్స్  యాజమాన్యం కూడ ప్రకటించింది. కియా మోటార్స్ ఏపీ రాష్ట్రం నుండి తరలివెళ్లే అవకాశం ఉందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!